Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

లైట్ తీసుకోవద్దు, ఇబ్బంది పడతారు.. జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు కీలక సూచనలు

జగన్ సర్కార్‌కు కీలక సూచనలు చేసింది. పండగల సమయాల్లో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశించింది. ఉదాసీనత వద్దని.. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజుల వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని సామాజిక కార్యకర్త సురేష్ పిటిషన్ వేశారు. కేంద్ర మార్గదర్శకాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ మరొకరు.. కార్పోరేట్‌ ఆస్పత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అఖిల భారత లాయర్ల సంఘం అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ పిటిషన్లు వేశారు. మరికొన్ని వ్యాజ్యాలు దాఖలుకాగా కోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ తరపు లాయర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కోర్టుకు వివరించారు. గత విచారణలో ధర్మాసనం లేవనెత్తిన అంశాలపై మెమో అందజేశామన్నారు. అలాగే కరోనా కేసుల సంఖ్య తగ్గిందని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరింత వేగవంతం చేశామన్నారు. అమికస్‌ క్యూరీ సీనియర్‌ న్యాయవాది వైవీ రవి ప్రసాద్‌ స్పందిస్తూ.. పండుగల నేపథ్యంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం తరఫున న్యాయవాది అలేఖ్య వాదనలు వినిపిస్తూ.. సాంకేతిక కారణాల వల్ల ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైందన్నారు. ఉదాసీనత వద్దని.. నిబంధనలు పాటించాలని ప్రభుత్వానికి సూచించింది. విచారణను అక్టోబర్‌ 20కి వాయిదా వేసింది.

Post a Comment

0 Comments

Close Menu