Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

Andhra Pradesh PRC: ఉద్యోగులకు సంక్రాంతి కానుక సిద్ధం!.. ఇవాళ ఫైనల్‌ కానున్న పీఆర్సీ ఇష్యూ..

  Andhra Pradesh PRC: ఏపీ పీఆర్సీ ఇష్యూ క్లైమాక్స్‌కి చేరిందా? ఉద్యోగసంఘాలతో సీఎం జగన్‌ భేటీతో దీనికి ఎండ్‌ కార్డ్‌ పడనుందా? వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్‌సీ ముచ్చట క్లైమాక్స్‌కి చేరింది. ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్న విధంగా సీఎం జగన్‌తో భేటీకి టైం ఫిక్స్‌ అయ్యింది. ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్‌ సమావేశమై ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వనున్నారు. పీఆర్‌సీ వ్యవహారంపై నాన్చటం సరికాదని, తేల్చేయాలని సీఎం జగన్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఈ సమావేశంలో జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్‌లో ఉన్న 13 సంఘాల నేతలు పాల్గొననున్నారు. దీనికి ముందు.. ఉదయం 9.30 గంటలకు సీఎంతో ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఫిట్‌మెంట్‌పై తుది చర్చలు జరుపనున్నారు. ప్రభుత్వం 14 నుంచి 29 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 10.30 గంటలకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు సమావేశం కానున్నారు. సీఎంతో సమావేశం సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు.
ఇదిలాఉంటే.. బుధవారం నాడు రాష్ట్ర సీఎస్, మంత్రి బుగ్గన, సజ్జలతో భేటీ అయ్యారు సీఎం జగన్‌. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై చర్చించారు. ఇక పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌ భేటీ అవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇవాళే ఫైనల్ డిసిషన్‌ ఉంటుందన్నారు. ఇక మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 30శాతం కంటే తమకు ఎక్కువ ఫిట్‌మెంట్‌ వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆశిస్తున్నారు. అదే సమయంలో 40శాతానికి పైగా డిమాండ్‌ చేస్తున్నా, 30 శాతానికి అటుఇటుగా ఫిట్‌మెంట్‌ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే డీఏల బకాయిలు ఉండటంతో, వీటిని పరిగణలోకి తీసుకొని సీఎం జగన్‌ వద్ద ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలు ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. ఇంకా రూ. 1,600 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఈ అంశంపైనా ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీతో సహా ఆర్థిక పరమైన అంశాలకు సీఎం జగన్‌ ఇవాళ ముగింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా పీఆర్‌సీ ప్రకటించే ఛాన్స్‌ ఉంది.


Post a Comment

0 Comments

Close Menu