Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

Mansas Trust: మాన్సస్ కేంద్రంగా మరో వివాదం.. అలా ఎలా చేస్తారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు..

  Mansas Trust: మాన్సస్ కేంద్రంగా మరో వివాదం రాజుకుంది. ఆ వివాదం కలెక్టర్ వరకు వెళ్లింది. ఇంతకీ ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. మాన్సస్ అనుమతి లేకుండా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో మాన్సస్ ఆస్తుల కొలతలు జరిపారని ట్రస్ట్ ఈవో ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కోట ముందున్న ఖాళీ స్థలంలో పబ్లిక్ పార్కింగ్ కోసం మునిసిపల్ అధికారుల ఏర్పాట్లు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన మాన్సస్ ఈవో.. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి.. మునిసిపల్ సిబ్బంది సహకారంతో మాన్సస్ ఖాళీ స్థలం ఆక్రమణకు పాల్పడుతున్నారని కలెక్టర్ కు లేఖ రాశారు. మాన్సస్ ఆస్తులకు రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, మాన్సస్ ట్రస్ట్‌కు చెందిన ఖాళీ స్థలంను ప్రైవేట్ సెక్యురిటీతో కాపలా కాయిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వీరభద్ర స్వామి అనుచరులు, వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత అశోక్ గజపతి రాజు ఒత్తిడితోనే మాన్సస్ ఈవో.. ఎమ్మెల్యే కోలగట్ల పై ఫిర్యాదు చేశారని మండిపడుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu