న్యూఢిల్లీ : ఢిల్లీలోని Chandni Chowkలో ఈరోజు తెల్లవారుజామున major fire accident జరిగింది. ఈ ఘటనలో దాదాపు 60 దుకాణాలు, స్టాళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంటలను ఆర్పేందుకు 12 Fire engines ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఎర్రకోట ఎదురుగా ఉన్న Lajpat Rai Marketలో తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సంఘటన స్థలంలో తీసిన వీడియోల్లో మంటలు నాల్కలు చాచి విరుచుకుపడుతుండడం కనిపిస్తోంది.
మంటల్లో దుకాణాలు పూర్తిగా కాలిపోయి దగ్ధమయ్యాయి. బూడిదగా మారిపోయాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి కారణమేమిటనే దానిపై ఇంకా సమాచారం లేదు.
కాగా, తూర్పు అమెరికాలోని Philadelphia నగరంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదమే సంభవించింది. బుధవారం Three-story buildingలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు సహా 13 మంది మరణించారని అధికారులు తెలిపారు.
ఈ Fire hazardపై ఫిలడెల్ఫియా ఫైర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ క్రెయిగ్ మర్ఫీ మాట్లాడుతూ, మరణాల సంఖ్య "డైనమిక్‌గా ఉంది, ఎందుకంటే లోపల ఇంకా రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని అన్నారు. Rescue operation లో భాగంగా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
అంతేకాదు, తన 35 ఏళ్ల సర్వీసులో తాను చూసిన అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం ఇదేనని ఆ అధికారి విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలేమిటో, మంటలు ఎలా చెలరేగాయో ఇప్పుడే చెప్పలేమని.. ఈ విషయం మీద తమ డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతోందని మర్ఫీ చెప్పారు.
ఈ ప్రమాదం మీద ఎలాంటి అనుమానాలూ లేవు. ఇది కావాలని చేసిందనిమేమే అనుకోవడం లేదు. కాకపోతే ఈ ఘటన మీద అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం... అని ఆయన విలేకరులతో అన్నారు. ఈ ప్రమాదఘటన మీద అతున్నత స్థాయి పరిశోధన జరిపిస్తాం. దీనికోసం మా వనరులన్నింటినీ ఉపయోగిస్తాం... అని ఆయన తెలిపారు.
ఫిలడెల్ఫియా పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందిన ఈ భవనంలో నాలుగు Smoke detectors ఉన్నాయని, అయితే వాటిలో ఏదీ పనిచేయడం లేదని ఆయన అన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన తరువాత ఎనిమిది మంది వ్యక్తులు దీని బారినుంచి తప్పించుకోగలిగారని మర్ఫీ చెప్పుకొచ్చారు.
అగ్నిమాపక శాఖ అధికారులు ఉదయం 6:40 గంటలకు (1140 GMT) ఫెయిర్‌మౌంట్ ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. "మూడు అంతస్తుల రోహౌస్‌లోని రెండవ అంతస్తు నుండి భారీగా మంటలు వస్తున్నట్లు గమనించారు"
"N. 23వ సెయింట్‌లోని 800 బ్లాక్‌లో ఈ ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే దీనిపై PFD స్పందించింది" అని ఫిలడెల్ఫియా ఫైర్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. చెలరేగుతున్న మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి 50 నిమిషాల సమయం పట్టిందని తెలిపింది.
0 Comments