Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

Women Doctors Wedding: పెళ్లి పీటలెక్కబోతున్న ఇద్దరు లేడీ డాక్టర్స్‌.. ఎక్కడో తెలుసా..


  Women Doctors Wedding: ఇటీవల హైదరాబాద్‌లో గే మ్యారేజ్‌ అట్టహాసంగా జరిగింది. ఇది తెలంగాణలోనే ఇద్దరు స్వలింగ సంపర్కులు చేసుకున్న మొట్టమొదటి పెళ్లి. అయితే, కేవలం ఇప్పటిదాకా విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి. ఇప్పుడిప్పుడే మన దేశానికి కూడా పాకుతోంది. తాజాగా ఇలాంటిదే మరో జంట వివాహం రచ్చ రేపుతోంది. ఇద్దరు లెస్బియన్లు పెళ్లి చేసుకోబోతోన్నారు. ఇంతకాలం సహజీవనం చేసిన వీరు త్వరలో ఒక్కటి కాబోతోన్నారు. వారిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబీకులు అంగీకరించటంతో అందరి సమక్షంలోనే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
పూర్తి వివరాల్లోకెళితే.. పరోమిత ముఖర్జీ, సురభి మిత్ర అనే ఇద్దరూ డాక్టర్లు. చాలాకాలం నుంచీ మంచి మిత్రులు. ఇప్పుడు ఈ స్నేహితులిద్దరూ.. ప్రేమికులుగా మారారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించారు. తొలుత వారు వ్యతిరేకించినప్పటికీ, చివరకు అంగీకరించారు. దాంతో ఇద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. గోవాలో వివాహ వేడుకలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu