Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

PF Interest Deposited: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో రూ.24 కోట్లు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం


  PF Interest Deposited: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) డిపాజిటర్ల ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ చేసినట్లు ఈపీఎప్‌ఓ తెలిపింది. మొత్తం 24.07 కోట్ల మంది ఖాతాల్లో ఆర్థిక సంవత్సరానికి 2020-21కి చెందిన 8.50 శాతం వడ్డీని జమ చేసినట్లు తెలిపింది. ఈపీఎఫ్‌ఓ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. 8.50 శాతం రేటుతో వడ్డీని 24.07 కోట్ల అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి:
1. ముందుగా ఉద్యోగులు epfindia.gov.inలో EPFO ​​వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

2. ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. passbook.epfindia.gov.in URLతో కొత్త పేజీ కనిపిస్తుంది.

3. UAN నంబర్, పాస్‌వర్డ్ మరియు క్యాప్చా నమోదు చేయండి

4. వివరాలను నమోదు చేసిన తర్వాత, మీరు కొత్త పేజీలో సభ్యుల IDని ఎంచుకోవాలి.

5. మీరు మీ PF బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు.

UMANG యాప్‌ని ఉపయోగించి బ్యాలెన్స్‌ని చెక్ చేయండి:

1. మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్‌ని తెరిచి, EPFOపై క్లిక్ చేయండి.

2. ‘వ్యూ పాస్‌బుక్’పై క్లిక్ చేయండి.

3. మీ UAN నంబర్, పాస్‌వర్డ్ మరియు OTPని నమోదు చేయండి.

4. మీ వివరాలను ధృవీకరించిన తర్వాత, మీరు మీ PF బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు.

SMS ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయండి:
EPFO చందాదారులు 7738299899కి SMS పంపడం ద్వారా వారి PF బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. PF బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి మీరు EPFOHO UANని 7738299899కి పంపాలి. అయితే, సేవను ఉపయోగించడానికి, మీ పాన్, ఆధార్ లింక్ చేసి ఉండాలి.

Post a Comment

0 Comments

Close Menu