Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

విజయవాడ డెంటల్‌ కాలేజీలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: ఆరోగ్య శాఖ విచారణ


  విజయవాడ: బెజవాడలోని   dental కాలేజీలో విద్యార్ధినులపై  Sexual Harassment ఫిర్యాదుల ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది.  ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఆరోపణలు ఎదుర్కొంటున్న  వైద్యులపై విచారణ చేస్తోంది. ఇదే వైద్యులపై గతంలో కూడా పలుమార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్టుగా చెబుతున్నారు.
డెంటల్ కాలేజీలోని ఇద్దరు doctorsపై ఆరుగురు Women Students  రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో వైద్య విధ్యార్ధినులు కోరారు. ఈ ఫిర్యాదు మేరకు  వైద్య ఆరోగ్య శాఖాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్ధినుల నుండి కూడా వైద్యుల కమిటీ వివరాలను సేకరించింది. ఈ విషయమై విమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా వివరాలను సేకరించింది. మరో వైపు కాలేజీలో పనిచేసే కాంట్రాక్టు మహిళా సిబ్బందికి కూడా  లైంగిక వేధింపులు తప్పలేదు.ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి మహిళా ఉద్యోగినులు వెనుకంజ వేస్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu