Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

తండ్రి జ్ఞాపకార్థం 12 ఎకరాల్లో పేదల కోసం పట్టాల పంపిణీ


  తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలిలో కుమ్మరి నాగేంద్ర తన తండ్రి సుంకన్న జ్ఞాపకార్థం బుధవారం 12 ఎకరాల తన సొంత పొలంలో 670 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్థలాల్లో ప్రభుత్వమే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

కార్యక్రమంలో అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య, గుంతకల్లు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నైరుతిరెడ్డి, మంత్రి జయరాం తనయుడు అశోక్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ప్రదీప్‌రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు రా మ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొని నాగేంద్ర, వరలక్ష్మి దంపతులను అభినందించారు.


Post a Comment

0 Comments

Close Menu