కాలం మారిపోతున్నా.. టెక్నాలజీ పెరుగుతున్నా మూఢనమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఆ మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకొని ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. గతేడాది ఓ కుటుంబం దేవుడు కనిపిస్తాడని, వేరే లోకం వెళ్తామని ఇద్దరు కూతుర్లను తలపై కొట్టి చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. కేవలం నిరక్షరాస్యులే ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతారనే విషయం తప్పని ఆ ఘటన నిరూపించింది.
అలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆధ్యాత్మికత ముసుగులో మహిళలను లైంగికంగా వాడుకున్న దొంగ స్వామిజీలను ఎందరినో చూస్తున్నాం. అయినా అలాంటి స్వామిజీలను జనం ఇప్పటికీ నమ్ముతున్నారు. అలాగే మూఢనమ్మకాలతో భయపెట్టి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఘటన ఇప్పుడు మరొకటి భయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఆమె ఓ గిరిజన యువతి. అమయాకురాలు. ఓ 50 ఏళ్ల వ్యక్తి ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు. దాని కోసం చేతబడిని ఆయుధంగా మార్చుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే తల్లిదండ్రులపై చేతబడి చేస్తానని భయపెట్టాడు. దీంతో బెదిరిపోయిన ఆ యువతి ఆ వ్యక్తి చెప్పినట్టు చేసింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని భయపెట్టాడు. ఆ 50 ఏళ్ల వ్యక్తి 5 నెలలుగా లైంగిక దాడి చేయడంతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అతడికి తెలియడంతో గర్భస్రావం జరగడానికి ట్యాబ్లెట్లు తెచ్చి ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న యువతికి తీవ్ర కడుపును నొప్పి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. హాస్పిటల్ లో డాక్టర్లు ఆమె గర్భవతి అని చెప్పారు. దీంతో ఏం జరిగిందని ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. జరిగిన ఘోరం మొత్తం చెప్పింది.
ఈ ఘటన విషయంలో యువతి తండ్రి శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరికోటలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి ఇందులో బాధితురాలు. ఆమెను ఓ 50 ఏళ్ల వయసున్న కాదలేటి గోపాల్ లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులపై చేతబడి చేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆమెపై 5 నెలలుగా లైంగికంగా దాడి చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. కొన్ని రోజుల తరువాత ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో గర్భస్రావం జరగడానికి ఆమెకు కొన్నిట్యాబ్లెట్లు ఇచ్చాడు. అవి వేసుకున్న ఆ యువతికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను స్థానిక సుళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. ఆమె గర్భంతో ఉందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. ఈ ఘటనలో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గోపాల్ పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments