China-Divorce: భార్యాభర్తల మధ్య బంధాన్ని విడాకులతో ముగించడానికి ఎక్కువగా తమ జీవిత భాగస్వామి తమను మోసం చేసింది అంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.. ఈ రీజన్ తో డైవర్స్ కు అప్లై చేయడాన్ని తాము అనుమతించమంటూ చైనాలోని ఓ కోర్టు పేర్కొంది. దీంతో చైనాలో దుమారం చెలరేగింది. గ్లోబల్ టైమ్స్ యొక్క నివేదిక ప్రకారం.. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కోర్టు.. విడాకులకు దరఖాస్తు చేస్తూ.. మోసం అనే రీజన్ చెబితే అటువంటి విడాకుల దరఖాస్తులను స్వీకరించమని తెలిపింది. అయితే కోర్టు నిర్ణయం పై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే.. అసలు కోర్టుకు అభ్యంతరం ఏంటని అంటున్నారు.
సహజీవనాన్ని మోసంగా పరిగణించలేమని కోర్టు చెప్పింది. సహజీవనం అంటే పెళ్లయిన వ్యక్తి పెళ్లి చేసుకోకుండా ఎవరితోనైనా నిరంతరం జీవించడమేనని పేర్కొంది. విడాకుల దాఖలు చేయడానికి వ్యభిచారాన్ని ఒక కారణంగా గుర్తించలేమని కోర్టు పేర్కొంది. ఈ నిర్ణయం చైనాలో సంచలనం సృష్టించింది. డ్రాగన్ ప్రజలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదిక వీబోలో ‘మోసం చేశారనే కారణంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే వీల్లేదు’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
విడాకుల చట్టంపై చైనాలో కూడా రచ్చ:
గతేడాది విడాకుల చట్టంలో కొన్ని మార్పులు చేసి చైనా ఆమోదించింది. దీంతో జంటలు విడాకులు తీసుకోవడం కష్టంగా మారింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరైనా జంట విడాకులు తీసుకోవాలంటే.. నెలపాటు ‘కూలింగ్ ఆఫ్’ పీరియడ్‌లో ఉండవలసి ఉంటుంది. ఇలా నెల రోజుల పాటు జంటను కలిపి ఉంచడానికి కారణం ఏమిటంటే.. జంట విడాకులు తీసుకోకూడదు.. వారు వైవాహిక బంధాన్ని కొనసాగించడానికి సమయం ఇవ్వాలనేది. నెల రోజుల తర్వాత కూడా ఇరువురు మధ్య సయోధ్య కుదరకపోతే అప్పుడు మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విడాకులు తీసుకునే ప్రక్రియలో 30 రోజులలోపు క జీవిత భాగస్వామి వైదొలిగితే.. డైవర్స్ కోసం చేసుకున్న దరఖాస్తు రద్దు చేయబడుతుంది. ఇది విడాకుల ప్రక్రియను క్లిష్టతరం చేస్తుందని జంటలు భయపడుతున్నారు. అదే సమయంలో, బాధిత పక్షం మళ్లీ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీంతో డైవర్స్ ఆలస్యం కావడమేకాదు.. లాయర్లు కు కూడా ఫీజులు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
విడాకుల రేటు
ప్రభుత్వం కొత్త విడాకుల చట్టాన్ని ఆమోదించిన తర్వాత.. పౌరులు తమ వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని విమర్శిస్తున్నారు. చైనాలో విడాకుల రేటు 2000 సంవత్సరంలో ప్రతి 1,000 మందికి 0.96గా ఉంది. కానీ 2019లో అది 3.36కి పెరిగింది. 2019లో 40 లక్షల మందికి పైగా విడాకులు తీసుకున్నట్లు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి.
0 Comments