ఇబ్రహీంపట్నం : పిల్లల కోసం ఓ married woman వింత నాటకం ఆడింది. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోవడంతో.. అత్తింటివారి, చుట్టుపక్కలవారి సూటిపోటి మాటలు తట్టుకోలేక actingకు తెరలేపింది. children కోసం పరితపిస్తున్న ఆమె ఆ బాధ తట్టుకోలేక తాను pregnant అని అందరికీ చెప్పింది. తొమ్మిది నెలలపాటు ఆ నాటకాన్ని బాగానే కొనసాగించింది. డెలివరీ సమయం దగ్గర పడుతుంటే ఏం చేయాలో తెలియలేదు. చివరకు బిడ్డను ప్రసవించాక ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పింది. విషయం తెలిసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణలో అసలు విషయం బయట పడడంతో అందరూ నివ్వెరపోయారు.
కృష్ణా జిల్లా కొండపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొండపల్లికి చెందిన యువతికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరాకు చెందిన వ్యక్తితో 9 ఏళ్ల కిందట వివాహం అయింది. అయితే పెళ్లైన యేడాది నుంచే పిల్లలకోసం ప్రయత్నిస్తున్నా వీరికి సంతానభాగ్యం కలగలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి.. కానీ పిల్లలు పుట్టలేదు. వీరికి సంతానం కలగకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు లోపం ఉందేమో అని, గొడ్రాళని సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె దాన్నుండి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేసింది. తాను నెల తప్పానని అత్తగారి ఇంట్లో చెప్పింది. ఆతరువాత పుట్టింటికి వచ్చేసింది. తొమ్మిది నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది.
పుట్టింట్లో కూడా తాను గర్భవతిననే విషయాన్ని నమ్మించడానికి పొట్ట చుట్టూ బట్టలు చుట్టుకునేది. ప్రతినెల వైద్యపరీక్షల కోసం అని చెప్పి ఆసుపత్రికి వెల్తున్నానని చెప్పి వెళ్ళేది. అయితే ప్రసవసమయం దగ్గర పడుతుండడంతో కాన్పు ఎప్పుడు అనే సమస్య వచ్చింది. టెన్షన్ మొదలయ్యింది. ఈ నెల 5న ప్రసవానికి వైద్యులు తేదీ ఇచ్చారని అందరికీ చెప్పి నమ్మించింది.
ఒక్కతే వెళ్లి ఆస్పత్రిలో చేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి తనకు నొప్పులు వచ్చాయని.. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు తనకు కాన్పు చేస్తానని వచ్చి బిడ్డ పుట్టాక తీసుకెళ్లిపోయారు.. అని ఆందోళన చెందుతూ కుటుంబసభ్యులు.. చుట్టుపక్కల వారికి చెప్పింది.
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్ కుమార్ తన సిబ్బంది తో బుధవారం సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు. అయితే సదరు మహిళ చెబుతున్న దాంట్లో ఏదో తేడా ఉన్నట్టుగా అనుమానం వచ్చింది. దీంతో ఆమెను వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్ష చేసిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. అసలు ఆ వివాహిత గర్భవతి కానే కాదని, ఇక కాన్పు విషయం కూడా ఎక్కడినుంచి వస్తుందని.. అది అంతా నాటకం అని నిర్ధారించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారణ చేయడంతో ఆమె అసలు విషయాన్ని బయట పెట్టింది.
ఆమె ఆడిన నాటకానికి కోపానికి రావాలో.. పిల్లల కోసం పరితపించే ఆమెను అర్థం చేసుకోవాలో.. పిల్లలు కలగకపోవడాన్ని వెంటాడి, వేధించే సమాజాన్ని చూసి బాధపడాలో.. తెలియక కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు ఆలోచనలో పడిపోయారు.
0 Comments