Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

భార్య వివాహేతర సంబంధం.. దమ్ము చేసిన మడిలో తోసి.. ట్రాక్టర్ తో తొక్కించి యువకుడి పాశవిక హత్య...

   సూర్యాపేట :  భార్యతో extramarital affair నెరుపుతున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దమ్ము చక్రాలతో తొక్కించి అత్యంత కిరాతకంగా murder చేసిన  ఉదంతం ఇది.   ఈ పాశవిక ఘటన Suryapeta District  హుజూర్ నగర్ మండలం లక్కవరంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, Dead person బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహేష్ (30) రైతు. మంగళవారం గూబగుట్టకు వెళ్లే దారిలో తన అన్న నాగరాజు పొలంలో నాట్లు వేసే పనిలో మహేష్ సైతం పాల్గొన్నాడు.
నాట్లు ముగిసిన తర్వాత కూలీలను స్వగ్రామంలో దింపడానికి నాగరాజు ట్రాక్టర్ తీసుకుని వెళ్ళాడు. తర్వాత మహేష్ తన టూవీలర్ వాహనంపై ఇంటికి బయల్దేరాడు.  అదే సమయంలో గ్రామానికి చెందిన Tractor driver ఒకరు పొలాన్ని దమ్ము చేసి అదే దారిలో ఇంటికి వెళ్తున్నాడు.  టూ వీలర్ పై ఒంటరిగా వెళ్తున్న మహేష్ ను అతను గమనించాడు. ఇది వరలో వారిద్దరికీ ఉన్న పాత కక్షలు గుర్తుకువచ్చాయి. 

మహేష్ ఒంటరిగా దొరకడంతో తన పగ తీర్చుకోవచ్చనుకున్నాడు. ఈ నేపథ్యంలో  ట్రాక్టర్ తో మహేష్ టూవీలర్ ఢీకొట్టాడు. దీంతో మహేష్ ద్విచక్ర వాహనంతో సహా పక్కనే ఉన్న దమ్ము చేసిన మడిలో పడిపోయాడు. అతను అంతటితో ఆగలేదు. మడిలో పడిపోయిన  అతనిపై నుంచి ట్రాక్టర్ ను తోలాడు. బండితో సహా మడిలో తొక్కించాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మరణించాడు. 

మహేష్ చనిపోయిన తరువాత కానీ.. తానేం చేశాడో అతనికి అర్థం కాలేదు. వెంటనే ట్రాక్టర్ ను బైటికి తీసి.. ఘటనాస్థలానికి కొద్దిదూరంలో ట్రాక్టర్ ను వదిలేసి పారిపోయాడు. ఇక ఆ రాత్రి ఆ విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. బుధవారం ఉదయం అటువైపు వచ్చిన రైతులు మడిలో శవం ఉండడం గమనించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.  పోలీసుల  విచారణలో పలు అంశాలు వెలుగు చూశాయి.

ట్రాక్టర్ డ్రైవర్ భార్యకు మహేష్ తో వివాహేతర సంబంధం ఉందని.. ఇదే విషయంపై నాలుగేళ్ల కిందట గ్రామంలో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టించారని తెలిసింది. ఆ తర్వాత సమస్య సద్దుమణిగినా.. ఇటీవల మళ్లీ తన భార్య  జోలికి  మహేష్  వస్తున్నాడని అనుమానం పెంచుకున్న సదరు వ్యక్తి  ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో  గొడ‌వ ప‌డి అర్థ‌రాత్రి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక బాలికపై కొంద‌రు దాడి చేశారు. అంతే కాకుండా ఆ బాలికపై అత్యాచారం చేశారు. వీటితో ఆగ‌కుండా ఆ బాలిక‌ను వ్య‌భిచార కూపీలోకి దించారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని పాతబ‌స్తీలో చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక త‌న ఇంట్లో వాళ్లో గొడ‌వప‌డి న‌వంబ‌ర్ 20 న బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌దిరోజుల పాటు ఆ బాలిక కోసం వెతికి చివ‌ర‌కు డిసెంబర్ 1వ తేదీ బాధిత బాలిక తల్లి బహదూర్ పురా పోలీసులను ఆశ్ర‌యించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. చివ‌రికి ఓ ఇంటిపై దాడి చేయ‌గా.. బాలిక దొరికింది. 


Post a Comment

0 Comments

Close Menu