Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

IND vs SA: రహానెను తప్పించాల్సిందే.. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాల్సిందే.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

 
  జోహన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసింది. భారత రెండో ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే అత్యధికంగా 58 పరుగులు చేశాడు. పుజారాతో కలిసి అజింక్య రహానే 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఇంత గొప్ప సహకారం అందించినప్పటికీ, అతన్ని టీమ్ ఇండియా నుంచి తొలగించాలనే డిమాండ్ ఆగడం లేదు.

అజింక్య రహానే హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ, కేప్ టౌన్ టెస్టులో అతని స్థానంలో హనుమ విహారికి అవకాశం ఇవ్వాలని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘అజింక్య రహానే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు భవిష్యత్తు కోణం నుంచి ఆలోచించి, హనుమ విహారి ప్రదర్శనను కూడా పరిశీలిస్తే బాగుటుంది.’ అని గౌతమ్ గంభీర్ చెప్పాడు.

” విరాట్ కోహ్లీ తిరిగి వచ్చిన తర్వాత హనుమ విహారిని తొలగించకూడదు. ప్రతి క్లిష్ట సందర్భంలోనూ తనేంటో నిరూపించుకున్నాడు. జోహన్నెస్‌బర్గ్ టెస్టులో విహారి కూడా 40 పరుగులు చేశాడు. అలాంటి పరిస్థితుల్లో విహారీకి అవకాశం ఇవ్వాలి.” అని అన్నాడు. జోహన్నెస్‌బర్గ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌కు ముందు అజింక్యా రహానే ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అతని సగటు 20 కంటే తక్కువగా ఉంది. హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని క్రికెట్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. అయితే జొహన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియా గెలిస్తే రహానేకు మరో అవకాశం దక్కే అవకాశం ఉంది.


Post a Comment

0 Comments

Close Menu