నవ్వు నాలుగు విధాలా చేటు అనే సామేత వినే ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు విభిన్నం. నవ్వేయ్యండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటున్నారు నిపుణులు. మనసులో కష్టాలను.. మీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను పంటి బిగువున దాచిపెట్టి.. మనస్పూర్తిగా నవ్వి చూడండి. సరికొత్త ఉత్సాహం మీ సొంతమవుతుంది. కారణమేదైన రోజూ నవ్వుతూ ఉండే వ్యక్తులు ఉల్లాసంగా ఉంటారు. హాయిగా నవ్వడం.. ఆరోగ్య సంజీవని. కానీ ప్రస్తుతం ఉద్యోగా హడావిటి, మితిమీరిన ఒత్తిడి.. ఉరుకుల పరుగుల జీవితం.. ఇతర సమస్యల కారణంగా చాలావరుకు నవ్వడమే మర్చిపోయారు. ఎప్పుడో ఒక ఐదు నిమిషాలు నవ్వడమే కరువైపోయింది. ఉద్యోగం.. పని ఒత్తిడి కారణంగా నవ్వకపోవడం వలన మీరు ఎన్ని ప్రయోజనాలు కోల్పోతున్నారో తెలుసా..
మనకు వచ్చే సగం అనారోగ్య సమస్యలన్ని ఒత్తిడి వలనే వస్తుంటాయి. గుండె జబ్బులు, డయబెటీస్, రక్తపోటు, డిప్రెషన్, ఇన్సోమియా, మైగ్రేన్, ఆతృత, అలర్జీ, పెప్టిక్ అలర్స్ తదితర సమస్యలను ఒత్తిడి వలన వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే మీరు మనస్పూర్తిగా నవ్వాల్సిందే. నవ్వడం వలన ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల శ్రావకాలు తగ్గుముఖం పడతాయి. రోజుకు పది నిమిషాలు నవ్వడం వలన 10-20 మి.మీల రక్తపోటు తగ్గుతుంది. అలాగే నవ్వు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ ఒత్తిడిని తగ్గించి.. మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.
శరీరంలో శ్వాస వ్యాయామం చేయడానికి నవ్వు కూడా ఒకటి. ఇది శరీరానికి ఆక్సిజన్ అందిస్తుది. రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు సహాయపడుతుంది. తరచూ నవ్వేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట. రోజంతా నలుగురితో కలిసి నవ్వుతూ ఉండేవారి కంటే.. ఒంటరిగా ఉండే వ్యక్తులు తొందరగా అనారోగ్యం భారిన పడతారట. నవ్వు శరీరంలో సహజ రోగ నిరోధక హార్మోన్ల ఉత్పత్తి పెంచుతాయి. ఫలితంగా ఆర్థరైటిస్, స్పాండలైటిస్, మైగ్రేన్ లాంటి వ్యాధులు దరిచేరవు. అలాగే నవ్వు నొప్పిని తగ్గిస్తుంది. లాఫింగ్ థెరపీ వలన నొప్పిని తగ్గించవచ్చు. నవ్వు వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుతాయి. ఆస్తమా రోగులకు మంచిది. నవ్వడం వల్ల ముక్కు, శ్వాసకోశాల్లోని పొరలు ఆరోగ్యంగా ఉంటాయి.
0 Comments