Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

CSD Bipin Rawat: బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నివేదిక.. పైలెట్ చివ‌ర‌గా ఏం చెప్పారంటే..

  General Rawat Helicopter Crash Report: భార‌త దేశ మొట్ట‌మొద‌టి త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ (CSD Bipin Rawat) సహా 13 మంది  గతేడాది డిసెంబర్‌ 8న తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై ట్రై-సర్వీసెస్‌ విచారణ చేప‌ట్టింది. దీనికి సంబంధించిన విచార‌ణ పూర్త‌యింది. అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తమ విచారణ నివేదికను సమర్పించింది. ఈ ప్ర‌మాదానికి జ‌ర‌గ‌డానికి గ‌త పూర్తి వివ‌రాల‌తో కూడిన నివేదికను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు దీనిపై ఏర్ప‌డిన క‌మిటీ సమర్పించింది.  అయితే, సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించి హెలికాప్టర్ ప్ర‌మాదానికి గురికావ‌డానికి  వాతావ‌ర‌ణం ప్రతికూలంగా ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని సంబంధిత వర్గాలు తెలిపాయి. సూలూరు నుంచి వెల్లింగ్‌టన్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌లో చిఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, మరో 12 మంది సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu