Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

Term Insurance Premiums: పాలసీదారులకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంల పెంపు.. కోవిడ్‌ క్లెయిమ్‌ల సంఖ్య పెరగడమే కారణమా..?

   Term Insurance Premiums: ప్రస్తుతం జీవిత బీమా పాలసీలు సంఖ్య పెరిగిపోతోంది. కరోనా తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేసుకేనేవారు పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలు కాలపరిమితి జీవిత బీమా పాలసీల ప్రీమియంలను పెంచుతున్నాయి. కోవిడ్‌ క్లెయిమ్‌ల భారం కూడా ప్రీమియం ధరలు పెంచడానికి ఒక కారణమని బీమా పాలసీ వర్గాలు చెబుతున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వంటి రెండు, మూడు కంపెనీలు ఇప్పటికే ప్రీమియంలను 10 శాతంకు పైగా పెంచినట్లు సమాచారం.
మరో రెండు, మూడు కంపెనీలు పెంచేందుకు రెడీ..
ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు కంపెనీల ప్రీమియం ధరలు త్వరలో పెంచేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయంగా పరిశీలిస్తే.. ఇండియాలో కాలపరిమితి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల రేట్లు తక్కువగా ఉన్నాయని, కరోనా తర్వాత ప్రీమియంలను పెంచుతున్నట్లు బీమా కంపెనీలు అధికారులు తెలిపారు. ఇక కోవిడ్‌ తర్వాత టర్మ్‌ పాలసీల రేట్లు 25 శాతానికి పైగా పెరిగినట్లు అంచనా ఉంది. అయితే కోవిడ్‌ ప్రభావం మరింతగా కొనసాగించినట్లయితే భవిష్యత్తులో ప్రీమియంలు మరింతగా పెరిగే అవకాశం ఉందందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కొంత భారాన్ని తాము భరించినా మిగతా భారాన్ని పాలసీ కొనుగోలుదారులకు భరించాల్సి వస్తోందన్నారు. ఈ భారం 10 నుంచి 15 శాతం వరకు పెంచుతున్నాయి. అలాగే పాలసీలు తీసుకునే ముందు పాలసీదారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని బీపా కంపెనీలు చెబుతున్నాయి. రూ. కోటి కన్నా తక్కువ బీమా ఉన్న పాలసీలకు కూడా కంపెనీలు ప్రత్యక్షంగా వ్యక్తుల ఆరోగ్యస్థితిగతులు తెలుసుకుంటున్నాయి. క్లెయిమ్‌ల సంఖ్య పెరగడం వల్ల పాత రేట్లకే టర్మ్‌ పాలసీలను అందించడం కష్టంగా మారిందని చెబుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu