Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం



  తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి): తండ్రే కామాంధుడై తన కన్న కూతురిపై  లైంగికదాడి చేస్తూ అడ్డువచ్చిన వారిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌ నుంచి 12 సంవత్సరాల కిందట వలస వచ్చిన ఓ కుటుంబం తాడేపల్లి మహానాడు ప్రాంతంలో నివాసముంటుంది. బాలిక తండ్రి సీలింగ్‌ పనిచేస్తుండగా తల్లి తన ఐదురుగు పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఇంట్లోనే నివాసముంటోంది. మద్యానికి బానిసైన ఆ తండ్రి సంవత్సర కాలం కిందట తన రెండవ సంతానమైన 11 సంవత్సరాల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కన్న కూతురు తన తండ్రి చేసిన పనిని తల్లికి చెప్పుకోవడంతో ఆమె బంధువులతో కలసి అతడ్ని నిలదీసింది.
బంధువుల సమక్షంలో భార్య కాళ్లు పట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తిరిగి బుధవారం ఆ కామంధుడు తన కూతురుపై లైంగికదాడి చేయడంతో ఆ తల్లి తన ఐదుగురు సంతానాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కృష్ణానదికి వెళ్లింది. బంధువులు ఆమె ప్రయత్నాన్ని ఆపి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అత్యాచారం చేసిన అనంతరం ఆ కామాంధుడు పారిపోయాడు. కామాంధుడు గతంలో తన తల్లిపై కూడా లైంగికదాడికి యత్నించినట్లు తెలిసింది.  

Post a Comment

0 Comments

Close Menu