Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

శ్రీవారి భక్తులకు అలర్ట్, వర్షాలకు తిరుమల వెళ్లలేకపోతున్నారా.. శుభవార్త చెప్పిన టీటీడీ

తిరుపతి, తిరుమలను వర్షాలు ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. చిత్తూరు జిల్లా మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. తిరుమలలో గత వారం రోజులు భారీగా వానలు పడుతున్నాయి. ఎడతెరుపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండలుగా మారాయి. భారీగా వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు వసతి గదులకు చేరుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. వర్షాలతో తిరుమలకు రాలేని భక్తులకు శుభవార్త చెప్పింది. గురు, శుక్ర, శనివారాలు శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులుకు ఉపశమనం కలిగించింది. ఆ తర్వాత రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రం, రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షపు నీటిని బయటకు పంపే టీటీడీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో భారీ వర్షాలు కారణంగా కొండలలో గట్టిగా ఉండే మట్టి పూర్తిగా మెత్తబడి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి, రెండో ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికుల అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ విజిలెన్స్ సూచిస్తోంది. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తుంది. ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారిని మూసివేసింది. వర్షంతో రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠం క్యూలైన్‌లోని సెల్లార్లలోకి నీరు చేరింది. వర్షానికి మాడవీధులు జలమయమయ్యాయి. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణికి సమీపంలో రహదారిపై చెట్టుకూలిపోయింది. కొండపై నుంచి రహదారిపైకి రాళ్లు, మట్టి కొట్టుకు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం బోర్డు చర్యలకు ఉపక్రమించింది. భారీ వర్షాల నేపథ్యంలో కనుమదారులను మూసివేయగా.. వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu