Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ రిలీఫ్.. మొత్తానికి లైన్ క్లియర్

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు విజయసాయికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఓకే చెప్పింది. కోర్టు రూ.5లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని విజయసాయిరెడ్డిని ఆదేశించింది. అక్టోబరులోగా రెండు వారాలు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. దుబాయ్, బాలి, మాల్దీవులకు వెళ్లేందుకు విజయసాయి అనుమతి కోరారు. తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు వెళ్తున్నట్లు కోర్టుకు ఎంపీ తెలియజేశారు. సీబీఐ కోర్టు ఆదేశాలకు ముందు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘లిటిగేషన్‌కు వెళ్లాలంటే ఏ స్థాయి లాయర్లను పెట్టుకోవాలి..? ఎంత ఫీజుకు సిద్ధపడాలి..? అని కక్షిదారులు ఆలోచిస్తారు. గంటకు కోటి తీసుకునే ప్లీడర్‌ను నియమించుకోవడం ఒక ఎత్తయితే కోవర్టుకు కక్షిదారు వేషం వేసి లక్షల యూరోలు చెల్లించడం నయా శకుని చంద్రానికే చెల్లింది’అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu