టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ (71 నాటౌట్: 32 బంతుల్లో 5x4, 5x6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్‌లో కెప్టెన్ అరోన్ ఫించ్ (44: 49 బంతుల్లో 4x4) మాత్రమే నిలకడగా ఆడాడు. వరుస విరామాల్లో ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో.. ఆస్ట్రేలియా సరిగ్గా 20 ఓవర్లలో 125 పరుగులకి ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని ఇంగ్లాండ్ టీమ్ కేవలం 11.4 ఓవర్లలోనే 126/2తో ఛేదించేసింది. టోర్నీలో మూడో మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియాకి ఇది తొలి ఓటమి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. అరోన్ ఫించ్‌తో కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1: 2 బంతుల్లో) రెండో ఓవర్లోనే క్రిస్‌వోక్స్‌కి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్‌స్మిత్ (1: 5 బంతుల్లో), గ్లెన్ మాక్స్వెల్ (6: 9 బంతుల్లో), మార్కస్ స్టాయినిస్ (0: 4 బంతుల్లో) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోవైపు కెప్టెన్ అరోన్ ఫించ్ క్రీజులో ఉన్నా.. వేగంగా ఆడలేకపోయాడు. మిడిల్ ఓవర్లలో మాథ్యవెడ్ (18: 18 బంతుల్లో 2x4).. చివర్లో అస్టన్ అగర్ (20: 20 బంతుల్లో 2x6) మెరుపులు ఒక ఓవర్‌కే పరిమితమయ్యాయి. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా 120పైచిలుకు స్కోరు చేయగలిగిందంటే అది పాట్ కమిన్స్ (12: 3 బంతుల్లో 2x6), మిచెల్ స్టార్క్ (13: 6 బంతుల్లో 1x4, 1x6) హిట్టింగ్ పుణ్యమే.ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్దాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తైమల్ మిల్స్, క్రిస్‌వోక్స్ చెరో రెండు, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ చెరో వికెట్ తీశారు. 126 పరుగుల ఛేదనని జేసన్ రాయ్ (22: 20 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి ఆరంభించిన జోస్ బట్లర్.. తొలి వికెట్‌కి 6.2 ఓవర్లలోనే 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ సిక్సర్లు బాదిన బట్లర్.. మిచెల్ స్టార్క్‌కి కూడా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదేశాడు. మిడిల్ ఓవర్లలో జేసన్ రాయ్‌ని ఆడమ్ జంపా, అనంతరం వచ్చిన డేవిడ్ మలాన్ (8: 8 బంతుల్లో 1x4)ని అగర్ ఔట్ చేసినా.. బట్లర్ మాత్రం వేగం తగ్గించలేదు. అతని దూకుడు చూసిన జానీ బెయిర్‌స్టో (16 నాటౌట్: 11 బంతుల్లో 2x6) కూడా ఆడమ్ జంపాకి బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదేయడంతో.. ఆస్ట్రేలియా 50 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
0 Comments