Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

అలా చేస్తే కఠినచర్యలు... ఆర్టీసీ డ్రైవర్లకు సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో కొందరు వాహనదారుల తీరుతో అప్పుడప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంటుంది. బస్సులు నడిరోడ్డుపై ఆపేస్తారని, ట్రాఫిక్ నిబంధనలను సరిగ్గా పాటించరని ఆర్టీసీ బస్సు డ్రైవర్లపైనా అనేక ఆరోపణలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎండీ సోమవారం కీలక ఆదేశాలు జారీచేశారు. ‘ప్రయాణికులను ఎక్కించుకునేందుకు రోడ్ల మధ్యలో ఆర్టీసీ బస్సులు ఆపటం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధం, ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్ల నుంచి వసూలు చేయటమే కాదు, క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోవాల్సి వస్తుంది’ అని సజ్జనార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. Also Read: బస్సులు రోడ్ల మధ్యలో ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, దీనివల్ల ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని సజ్జనార్ అన్నారు. రోడ్ల మధ్యలో బస్సులు ఆపడం నేరనన్న విషయాన్ని డ్రైవర్లకు చెప్పాలని డిపో అధికారులను ఆదేశించారు. ఇందుకోసం డిపోల నుంచి రోడ్లపైకి వచ్చే ముందు డీజిల్‌ బంకుల వద్ద బోర్డులు ఏర్పాటుచేయాలని, డ్యూటీ ఛార్టులు ఇచ్చే ముందు డ్రైవర్లకు సూపర్‌వైజర్లు వివరించి చెప్పాలన్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu