Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

ఎమ్మెల్సీ కవితకు రూ.21.62కోట్ల అప్పులు.. ఆస్తులెన్నో తెలుసా?

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్‌ దాఖలుకు ఆఖరి రోజు కావడంతో మధ్యాహ్నం 1:45 గంటలకు ముహూర్తం చూసుకుని నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సమర్పించారు. ఆమె వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. Also Read: ఈ సందర్భంగా తన పేరిట, కుటుంబసభ్యుల పేరిట ఉన్న చర స్థిరాస్తులు, అప్పుల వివరాలను కవిత అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరు మీద రూ.14.78 కోట్లు, భర్త పేరిట రూ.14 కోట్లు, ఇద్దరు పిల్లల పేర్లపై రూ.8.90 లక్షల చరాస్తులున్నట్లు కవిత అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె పేరుపై రూ.9.30 కోట్లు, భర్త పేరిట రూ.9.39 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పొందుపరిచారు. దంపతులిద్దరి పేరిట రూ.21.62 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లుగా చూపించారు. ఉద్యమ సమయంలో తనపై రెండు కేసులు నమోదైనట్లు కవిత పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu