Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి ఆపై యువకుడు కూడా..

ప్రియురాలిని హత్యచేసి ఆపై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మాదాపూర్‌లోని లెమన్‌ ట్రీ హోటల్‌లో ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్లేడుతో యువతి గొంతు కోసి బాత్రూంలో పడేసిన ప్రియుడు.. అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన సంతోషి, రాములుగా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం లెమన్ ట్రీ హోటల్‌లో ఈ జంట గదిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వివరాలను సేకరించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఈ ఘాతకానికి పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు ముందు ఇరువురు మధ్య ఘర్షణ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తులో పూర్తిస్థాయి వివరాలు బయటపడతాయని తెలిపారు. ఈ ఇద్దరూ నగరానికి ఎందుకొచ్చారు.. కుటుంబసభ్యులు వీరి ప్రేమకు అభ్యంతరం చెప్పారా? ఎటువంటి ఒత్తిడైనా ఉందా? అనేది మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌లో వాస్తవాలు బయటపడతాయని పేర్కొంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu