Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

IPL 2021: పడిలేచిన పంజాబ్.. ముంబయి టార్గెట్ 136

ఐపీఎల్ 2021 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌లు చేతులెత్తేశారు. ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. టీమ్‌లో మర్‌క్రమ్ (42: 29 బంతుల్లో 6x4) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముంబయి బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ రెండేసి వికెట్లు, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య చెరో వికెట్ తీశారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. మన్‌‌దీప్ సింగ్ (15: 14 బంతుల్లో 2x4) కలిసి పంజాబ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన కేఎల్ రాహుల్.. అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఓవర్ వ్యవధిలోనే మన్‌దీప్, రాహుల్‌తో పాటు క్రిస్‌గేల్ (1) కూడా పెవిలియన్‌కి చేరిపోగా.. నికోలస్ పూరన్ (2) పేలవ ఫామ్‌‌ని కొనసాగించాడు. దాంతో.. ఒకానొక దశలో 48/4తో నిలిచిన పంజాబ్.. కనీసం 100 పరుగలైనా చేస్తుందా..? అనే సందేహం కలిగింది. కానీ.. దీపక్ హుడా (28: 26 బంతుల్లో 1x4, 1x6) కలిసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన మర్‌క్రమ్.. ఐదో వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 15వ ఓవర్ నుంచి ఈ జోడీ గేర్ మార్చి వరుస బౌండరీలు బాదింది. కానీ.. 16వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన రాహుల్ చాహర్.. మర్‌క్రమ్‌ని ఔట్ చేసేయగా.. దీపక్ హుడాని బుమ్రా బోల్తా కొట్టించాడు. చివర్లో హర్‌ప్రీత్ బరార్ (14: 19 బంతుల్లో) వేగంగా పరుగులు రాబట్టలేకపోవడంతో.. పంజాబ్ 135 పరుగులతో సరిపెట్టుకోక తప్పలేదు.

Post a Comment

0 Comments

Close Menu