Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

కేసీఆర్ సంచలన నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీలకు పండగే

పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచులు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500కు, జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెంచింది. ఈ పెంపుదల జూన్‌ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను కొత్త పీఆర్‌సీ ప్రకారం 30 శాతం పెంచిన నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సైతం అదే స్థాయిలో పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంపై మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గౌరవ వేతనాల పెంపు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. ఎంపీటీసీ సభ్యులకు పంచాయతీ కార్యాలయాల్లో కనీస మర్యాద ఉండటం లేదని, కనీసం వారు కూర్చోనేందుకు కుర్చీ కూడా ఉండటం లేదని ఎమ్మెల్సీ కవిత సోమవారం మండలిలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రెండ్రోజులు గడవకముందే వారికి ప్రభుత్వం జీతాలు పెంచడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu