రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, కొన్ని మెయిల్/ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అలాగే పలు రైళ్ల దారి మళ్లించడం, వేగం పెంచడం, టెర్మినల్స్‌లో మార్పులు కూడా చేసింది. ఈ మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది. ప్రయాణికులు అక్టోబర్ 1 నుంచి మారిన టైమ్ టైబుల్కు అనుగుణంగా.. ప్రయాణించాల్సిన ట్రైన్స్ సమయాలను తెలుసుకోవాలని సూచించింది. IRCTC వెబ్సైట్ (www.irctc.co.in), నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్), సంబంధిత రైల్వే స్టేషన్ మేనేజర్ / ఎంక్వయిరీ కౌంటర్‌ను సంప్రదించడం ద్వారా రైళ్లకు సంబంధించిన సమాచారం, సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 872 ట్రైన్ సర్వీసులు నడుస్తుండగా.. 673 ట్రైన్స్ స్పీడ్ పెంచినట్టుగా వెల్లడించింది.
సూపర్ పాస్ట్‌గా మారనున్న రైళ్ల వివరాలు (కొత్త రైలు నంబర్లు) సికింద్రాబాద్ - మణుగూరు ఎక్స్‌ప్రెస్ (02745/02746) నర్సాపూర్ - నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ (02713/02714) కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (02777/02778) సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (02755/02756) కాకినాడ టౌన్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (02699/02700) సికింద్రాబాద్ - హైసర్ ఎక్స్‌ప్రెస్ (02789/02790)
ఎక్స్‌ప్రెస్‌గా మారనున్న ప్యాసింజర్ రైళ్ల వివరాలు..
పాత నెంబర్ |
రూట్ |
కొత్త నెంబర్ |
57121 |
కాజీపేట్-సిర్పూర్ టౌన్ |
07272 |
57122 |
సిర్పూర్ టౌన్ - కాజీపేట్ |
07271 |
57123 |
భద్రాచలం రోడ్ - సిర్పూర్ టౌన్ |
07260 |
57124 |
సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్ |
07259 |
57381 |
గుంటూర్- నర్సాపూర్ |
07267 |
57382 |
నర్సాపూర్- గుంటూర్ |
07268 |
57547 |
హైదరాబాద్ డెక్కన్- పూర్ణా |
07653 |
57548 |
పూర్ణా- హైదరాబాద్ డెక్కన్ |
07654 |
57549 |
హైదరాబాద్ డెక్కన్ - ఔరంగబాద్ |
07049 |
57550 |
ఔరంగబాద్- హైదరాబాద్ డెక్కన్ |
07050 |
57563 |
నాందేడ్- తాండూర్ |
07691 |
57564 |
తాండూర్- నాందేడ్ |
07692 |
67241 |
విజయవాడ - కాకినాడ పోర్ట్ |
07273 |
67242 |
కాకినాడ పోర్ట్- విజయవాడ |
07264 |
67243 |
కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం |
07265 |
67244 |
విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ |
07266 |
67297 |
గుడూరు - విజయవాడ |
07261 |
67298 |
విజయవాడ -గుడూరు |
07262 |
77281 |
గుంటూరు - కాచిగూడ |
07269 |
77282 |
కాచిగూడ- గుంటూరు |
07270 |
77693 |
కాచిగూడ -రాయిచూర్ |
07797 |
77694 |
రాయిచూర్ - కాచిగూడ |
07798 |
0 Comments