Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

బంగారం ధర జిగేల్.. భారీగా పెరిగిన వెండి!

పసిడి ప్రేమికులకు ఝలక్. బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. పసిడి పరుగులు పెడుతూనే ఉంది. బంగారం ధర ఈరోజు కూడా పెరిగింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.49,370కు పెరిగింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.350 పెరుగుదలతో రూ.45,250కు చేరింది. Also Read: బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు రూ.1000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.73,200 ఎగసింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్‌కు 1.03 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1812 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.91 శాతం తగ్గుదలతో 25.54 డాలర్లకు క్షీణించింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

Post a Comment

0 Comments

Close Menu