Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

షాకిచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి.. ఈరోజు రేట్లు ఇలా!

బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర పైపైకి చేరింది. పసిడి పరుగులు పెట్టింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పైకి కదిలింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.48,330కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 పెరుగుదలతో రూ.44,300కు ఎగసింది. Also Read: బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి ధర కేజీకి రూ.200 తగ్గుదలతో రూ.73,300కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1769 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 26.08 డాలర్లకు ఎగసింది. ఇకపోతే గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

Post a Comment

0 Comments

Close Menu