Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

Sri Lankanకి ఫస్ట్ వన్డేలో షాక్.. ఇంగ్లాండ్ అలవోక గెలుపు

ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంకకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ని 0-3తో చేజార్చుకున్న లంకేయులు.. తాజాగా తొలి వన్డేలోనూ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. బయో- సెక్యూర్ నిబంధనల్ని అతిక్రమించిన కుశాల్ మెండిస్, దనుష్ గుణతిలక, నిరోషాన్ డిక్వెల్లా‌లను సస్పెండ్ చేయడంతో బలహీనంగా కనిపించిన .. ఏ దశలోనూ ఆతిథ్య ఇంగ్లాండ్‌కి తొలి వన్డేలో పోటీనివ్వలేకపోయింది. దాంతో.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే గురువారం జరగనుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 42.3 ఓవర్లలోనే 185 పరుగులకి ఆలౌటైంది. ఓపెనర్ కుశాల్ పెరీరా (73: 81 బంతుల్లో 7x4), హసనరంగ (54: 65 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌వోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. విల్లీ మూడు, మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది. చివర్లో చమీర (7), జయవిక్రమ (4) రనౌట్‌లుగా వెనుదిరిగారు. 186 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (43: 21 బంతుల్లో 6x4) దూకుడుగా ఆడి ఇంగ్లాండ్‌కి మెరుపు ఆరంభాన్నివ్వగా.. జోరూట్ (79 నాటౌట్: 87 బంతుల్లో 4x4) అజేయ హాఫ్ సెంచరీ బాదేశాడు. కానీ.. ఒక ఎండ్‌లో జోరూట్ నిలకడగా ఆడుతున్నా.. ఇయాన్ మోర్గాన్ (6), శామ్ బిల్లింగ్స్ (3) పేలవంగా వికెట్లు చేజార్చుకున్నారు. అయితే.. మొయిన్ అలీ (28: 57 బంతుల్లో 1x4) కాసేపు ఓపికగా ఆడి జోరూట్‌కి సహకరించాడు. మొత్తంగా.. 34.5 ఓవర్లలో 189/5తో ఇంగ్లాండ్ విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో చమీరాకి మూడు, ఫెర్నాండో, కరుణరత్నెకి చెరో వికెట్ దక్కింది.

Post a Comment

0 Comments

Close Menu