Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొన్న వారికి కంపెనీ అదిరే శుభవార్త!

మీకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఉందా? అయితే మీకు తీపికబురు. కంపెనీ తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. సరికొత్త సర్వీస్ ప్యాకేజ్‌ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపే వారు ఒకసారి ఉచితంగానే ఫ్రీ సర్వీస్ పొందొచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త సర్వీస్ ప్యాకేజ్‌ పేరు సర్వీస్ కేర్ 24. ఇందులో 4 సాధారణ సర్వీసులు ఉంటాయి. అలాగ రెండు సార్లు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కలిగిన వారికి తొలి సర్వీస్ ఉచితంగానే లభిస్తుందని కంపెనీ తెలిపింది. Also Read: ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్వీస్ ప్యాకేజ్ ధర రూ.2,499. అన్ని ట్యాక్స్‌లు కలుపుకొనే ఈ ధర నిర్ణయించారు. ఈ ప్యాకేజ్ తీసుకున్న వారికి అదనపు రిపేర్ అవసరం అయితే విడిభాగాలపై, లూబ్రికేషన్‌పై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే లేబర్ చార్జీల్లో 20 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. మోటార్‌సైకిల్ ఛాసిస్ నెంబర్ వెరిఫికేషన్ తర్వాతనే ఈ సర్వీస్ ప్యాకేజ్ అందిస్తారు. ఈ సర్వీస్ ప్యాకేజ్ కొనుగోలు చేయాలని భావించే వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్యాకేజీని కొనుగోలు చేయొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu