Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

గ్రామ సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జులై 1 (గురువారం) నుంచి ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేసింది. కరోనా కారణంగా దీన్ని రెండు నెలలపాటు అధికారులు వాయిదా వేయగా... గురువారం నుంచి విధిగా అమలు చేయాలని సంయుక్త కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్‌ డాక్టర్‌ భరత్‌గుప్తా మంగళవారం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రతి ఉద్యోగి ఉదయం సచివాలయానికి వచ్చినప్పుడు, తిరిగి సాయంత్రం వెళ్లినపుడు విధిగా రోజులో రెండుసార్లు బయోమెట్రిక్‌ హాజరు వేయాలి. రోజూ మధ్యాహ్నం మూడింటి నుంచి ఐదింటి వరకు సచివాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణలో క్షేత్రస్థాయి ఉద్యోగులతో సహా అంతా పాల్గొనాలి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులు బయోమెట్రిక్‌ ఒక సారికి, రెండో సారి వేయడానికి కనీసం రెండు గంటల గ్యాప్‌ ఉండాలి. డిజిటల్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్‌, డాటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులు సచివాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి. బయటకు వెళ్లే సందర్భంలో మూవ్‌మెంట్‌ రిజిష్టర్‌లో విధిగా అన్ని వివరాలు నమోదు చేయాలి. సాధారణ, ఐచ్ఛిక సెలవులకు సంబంధించి హెచ్‌ఆర్‌ఎంఎస్‌ మాడ్యూల్‌లో ఉద్యోగులు దరఖాస్తు చేసి సంబంధిత శాఖల అధికారుల అనుమతి తీసుకోవాలి. ఉద్యోగులకు వేతనాలు బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా చెల్లింపులు జరుగుతాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రేపటి నుంచే బయోమెట్రిక్‌ హాజరు అమలయ్యేలా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని భరత్‌గుప్తా సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu