Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి రేటు మాత్రం అలా!

బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు తీపికబురు. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర తగ్గింది. పసిడి రేటు నేలచూపులు చూస్తే.. వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా ఉండిపోయింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 దిగొచ్చింది. దీంతో రేటు రూ.45,490కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.210 క్షీణతతో రూ.41,700కు తగ్గింది. Also Read: బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం అక్కడే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.69,300 వద్దనే కొనసాగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో 1710 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.51 శాతం క్షీణతతో 24.64 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

Post a Comment

0 Comments

Close Menu