Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

నిర్బంధాలతో ప్రజలను, ఉద్యమాలను అణగద్రోక్క లేరు- షేక్ కరీముల్లా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు chilakaluripet ap updates

నిర్బంధాలతో ప్రజలను, ఉద్యమాలను అణగద్రోక్క లేరు- షేక్ కరీముల్లా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు 

చిలకలూరిపేట: రాష్ట్రంలో ప్రస్తుతం బీహార్ తరహాలో అరాచక పాలన సాగుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు  షేక్ కరిముల్లా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధికార పక్ష పాలనకు నిరసనగా గురువారం “చలో అసెంబ్లీ” కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలలో భాగంగా బుధవారం రాత్రి టిడిపి నేతలకు నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించడం జరిగింది. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి నెల దాటినా నేటికి కూడా వారి కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. ప్రత్యేక హోదా ఫై నాడు ఢిల్లీలో దీక్షలు చేపట్టిన మీ నోళ్లు నేడు ఎందుకు మూసుకు పోయాయని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు  పెంచిన అంచనాలకు కేంద్రం టిడిపి హయాంలో ఒప్పుకొని,  నేడు పాత అంచనాలకు మాత్రమే నిధులు ఇస్తాo అని  నిస్సుగుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసే దమ్ములేక అక్రమ కేసుల్లో  అరెస్ట్ కు భయపడి పోలవరం భవిష్యత్తును అంధకారం చేశారన్నారు. ఇసుక దొరకని స్థితిలో పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుడు స్వయంగా మంత్రి పై తాపీతో దాడి చేసే స్థితికి తెగబడ్డారంటే, రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల స్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థం చేసుకోవాలని తెలిపారు. మద్యనిషేధం పేరుతో వైసీపీ నేతలు పిచ్చి మందు తయారు చేస్తూ పేదల ఆరోగ్యాoతో చెలగాటమాడుతూ మహిళను మోసం చేశారు.టిడ్కో ఇళ్ళు ఉచితం అని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసి, ప్రస్తుతం ఇళ్లకు డబ్బులు కట్టాలని పేదలను మోసం చేశారు.5 డీఏ లు  పెండింగ్ పెట్టి  పి.ఆర్ సి, అమలు చేయకుండా,సి, పి,ఎస్, ను రద్దు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులను మోసగించారని, వాలoటీర్లు సచివాలయల ఉద్యోగాల పేరుతో తాత్కాలిక ఉద్యోగాలిచ్చి యువతను మోసగించారని, పెట్టుబడిదారులను తరిమేసి పారిశ్రామిక ప్రగతిని అడ్డుకున్నారని, ఈ అసమర్థపాలనలో అన్ని వర్గాలు మోసపోయారని అందుకే ప్రజల పక్షాన ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చామని, పోలీసులతో ఉద్యమాలను అణగద్రోక్కలేరని ఈ సందర్భంగా కరిముల్లా తెలియజేశారు

Post a Comment

0 Comments

Close Menu