Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు**ఫిబ్రవరిలో పెట్టాలన్న ఎస్​ఈసీ నిర్ణయంపై స్టేకు ధర్మాసనం నిరాకరణ ap updates

*పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు*

*ఫిబ్రవరిలో పెట్టాలన్న ఎస్​ఈసీ నిర్ణయంపై స్టేకు ధర్మాసనం నిరాకరణ*



రాష్ట్ర ఎన్నికల సంఘం .ఫిబ్రవరిలో పెట్టాలన్న ఎస్​ఈసీ నిర్ణయంపై స్టేకు ధర్మాసనం నిరాకరణ రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేతకు.. హైకోర్టు నిరాకరించింది. కరోనా కారణంగా గతంలో నిలిచిన పంచాయతీ ఎన్నికలను.. ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. అయితే.. కరోనా ప్రభావం ఇంకా తొలగని కారణంగా నిర్వహణ సాధ్యపడదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ఎస్​ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ విషయమై విచారణ జరిపిన న్యాయస్థానం.. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరపాలన్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమని తెలిపింది. పిటిషన్​పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నవంబర్ 17న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రొసిడింగ్స్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది

Post a Comment

0 Comments

Close Menu