*దటీజ్ చంద్రబాబు.....*
▪️తెదేపా పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
▪️నేల పై చంద్రబాబు బైటాయింపుతో ప్రభుత్వం లో వణుకు
▪️రాత్రి 9 గంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ రూ. 590 కోట్లు విడుదల
▪️జీవో జారీ చేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ▪️ ఇది రైతులు విజయం ఎమ్మెల్యే ఏలూరి
రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పోరాటం ఫలించింది. మొద్దు నిద్రలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా గర్జించి నిద్ర లేపారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాయమాటలు చెప్పి, మాటల గారడీ చేసిందని, రైతులకు న్యాయం చేయకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు ఆగ్రహం,ఎమ్మెల్యేల పోరాటంతో వైసీపీ ప్రభుత్వం దిగొచ్చింది. రైతులకు పంటల బీమా కింద రూ.590 కోట్లు విడుదల చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీవర్ తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలతో అరణ్యరోదనలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో స్పీకర్ పోడియం ఎదుట నేల పై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. బీమా ప్రీమియం చెల్లించకుండా రైతులను ముంచారని ముఖ్యమంత్రి, మంత్రులు గాలి కబుర్లు చెబుతున్నారని అసెంబ్లీ సాక్షిగా అధినేత చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్నికల సమయంలో రైతులకు పంట బీమా చెల్లిస్తామని హామీలు గుప్పించిన జగన్ రైతులను నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు,ఎమ్మెల్యేల పోరాట ఫలితంగా బెంబేలెత్తిన ప్రభుత్వం ఆగమేఘాల మీద వ్యవసాయ శాఖకు రాత్రి రూ 590 కోట్లు కేటాయిస్తూ సోమవారం జీవో విడుదల చేసింది. 2019 ప్రీమియం కింద ప్రభుత్వం, ఫార్మర్ షేర్ క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించనున్నారు. ప్రభుత్వం మెడలు వంచి అయినా రైతులకు న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను చేసి చూపించాడు. ప్రభుత్వంపై పోరాడి రైతులకు అండగా నిలిచారు.దటీజ్ చంద్రబాబు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అండగా నిలిచి తమ సత్తా చాటారు. అన్నదాతల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాన్ని అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తన రాజకీయ చరిత్రలో అసెంబ్లీలో నేలపై కూర్చొని రైతాంగానికి బాసటగా నిలిచి ప్రభుత్వంతో పోరాడి రైతుల హక్కులను సాధించారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం పై రైతులు సాధించిన తొలి విజయంగా ఆయన అభివర్ణించారు.
0 Comments