*టోల్గేట్ సిబ్బందిపై చేయి చేసుకున్న వడ్డెర కార్పోరేషన్ ఛైర్ పర్సన్*
రాష్ట్ర వడ్డెర కార్మొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద హంగామా చేశారు.
టోల్ ఫీజు చెల్లించాలన్న సిబ్బందిపై చేయి చేసుకున్నారు.
తననే టోల్ చెల్లించాలంటారా అని సిబ్బందిపై పరుషపదజాలం ఉపయోగించారు.
కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె స్వయంగా దిగి తొలగించారు.
అడ్డగించబోయిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు.
తననే ఆపుతావా అంటూ కోపంతో ఊగిపోయారు.
అడ్డంగా పెట్టిన బారికేడ్లను తీసివేసి విజయవాడ వైపు వెళ్లారు.
0 Comments