Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

నమ్మి అప్పు ఇప్పించారు.. చివరికి ఇలా చేశారు


    బాగా నమ్మినవారు.. వారి అసవరానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో హామీ ఉండి అప్పు ఇప్పించారు.. తీరా వారు చేతులు ఎత్తేయడంతో.. సొంత ఆస్తి అమ్మి అప్పులు తీర్చారు.. అయినా ఆ అప్పు తీరకపోవడంతో చివరకు ఇలా చేశారు.
అన్నా రఘు,  అమరావతి ప్రతినిధి, న్యూస్ 18.                 AP Crime News:  నమ్మిన వారికి అండగా ఉండాలి అనుకోవడమే వారు  చేసిన పాపమైంది.  అవసరం ఉందన్నారు.. వారి మాటలు నమ్మి తెలిసినవారితో అప్పు  ఇప్పించారు.. తిరిగి తీర్చేందుకు హామీ కూడా ఉన్నారు. అయితే అప్పు తీసుకున్నవారిపై నమ్మకంతోనే ఇలా చేశారు. కానీ చివరికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన పాతూరి రత్తయ్య నీరజలది.. చింత లేని చిన్న కుటుంబం. రత్తయ్య జి కొండూరు లో సొంత క్రషర్ ఉంది. కొడుకు రాహుల్ కెనడా లో స్థిరపడ్డాడు. ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం మొత్తం సామాజికంగా ఆర్ధికంగా స్థిరపడి తన జీవితాన్ని ప్రశాంతం గా గడుపుతున్నసమయంలో ఊహించని పరిమాణం చోటు చేసుకుంది. పాతూరి రత్తయ్య నమ్మక ద్రోహానికి గురయ్యారు.

రత్తయ్య వ్యాపార బాగస్వామ్యులైన వెంకటేశ్వర రావు, శ్రీదేవి దంపతులకు దగ్గర ఉంచి అప్పు ఇప్పించారు. కానీ వారు తిరిగి అప్పు చెల్లించకుండా.. కాలయాపన చేయడంతో.. ఆ అప్పు రత్తయ్య నీరజలపై పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో వారే అప్పు తీరుస్తూ వచ్చారు.. కానీ చివరకు ఎవరూ ఊహించని రీతిలో  నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేక మానసిక క్షోభ కు గురైన పాతూరి రత్తయ్య నీరజ దంపతులు ఆత్మహత్య కు పాల్పడ్డారు.

విజయవాడ పటమట లంక కు చెందిన పాతూరి రత్తయ్య నీరజ దంపతులకు జి కొండూరు లో సొంత క్రషర్ ఉంది. వారి వ్యాపార బాగస్వామ్యులుగా వెంకటేశ్వర రావు, శ్రీదేవి ఉన్నారు వెంకటేశ్వర రావు శ్రీదేవి దంపతులకు రత్తయ్య హామీ ఉండి వేరే వారి దగ్గర మూడు రూపాయల వడ్డీకి అప్పు ఇప్పించారు. అది సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ తో కలిపి సుమారు మూడు కోట్ల రూపాయలవరకు చేరింది.

వెంకటేశ్వర రావు, శ్రీదేవి దంపతులు ఆ అప్పును తీర్చక పోవటం తో రత్తయ్య పై  అప్పు ఇచ్చిన వారు  ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఆఖరికి తమ ఇళ్లు.. ఇతర ఆస్తుల అమ్మి కొంత వరకు అప్పు తీర్చే ప్రయత్నం చేశారు. అయినా అప్పు తీరలేదు. పైగా వడ్డీలు పెరుగుతూ.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరిగింది. ఈ వ్యవహారం అంతా చుట్టు పక్కలవారికి తెలిసి ఆరా తీయడంతో తీవ్ర అమనాంగా భావించారు.

దీంత ఆ ఇల్లు వదిలి ఈపూరు మండలం బద్రూపాలెం లో తన బంధువు క్రషర్ లో మేనేజర్ గా చేరాడు. అక్కడ కొంతకాలం పనిచేసిన తరువాత ఆరోగ్య సమస్యల కారణంగా మల్లి పటమట లంక వెళ్ళాడు అక్కడ ఉండలేక తాడేపల్లి లో ఇల్లు అద్దెకు తీసుకొని నివసించారు ఆ దంపతులు.. అయినా వారిపై ఒత్తిడి తగ్గలేదు.  తమను వెంకటేశ్వర రావు, శ్రీదేవి నమ్మించి మోసం చేశారనే మనోవేదనకు గురవుతున్నాడు రత్తయ్య. ఈ క్రమం లో ఆదివారం తీవ్ర మనోవేదనకు గురైన రత్తయ్య భార్యతో కలసి బద్రూపాలెం ద్విచక్ర వాహనం పై బయటకువెళ్లారు. ముప్పాళ్ల దగ్గరకు చేరుకోగానే అద్దంకి బ్రాంచ్ కెనాల్  దగ్గర బైక్ ఆపీ..  రత్తయ్య నీరజ దంపతులు కెనాల్ దూకి  ఆత్మహత్య కు పాల్పడ్డారు.

నమ్మిన వారే ఇలా నట్టేట ముంచడంతో వారు ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయారు. దీనికి తోడు సన్నిహితుల, బంధువుల నుంచి పరామర్శలు ఎక్కువ కావడంతో పరువు పోయినట్టు భావించారు. ఏ తప్పూ చేయకపోయినా.. నమ్మిన వారికి అండగా ఉన్న పాపానికి ఇలా తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు ఆ దంపతులు..

Post a Comment

0 Comments

Close Menu