Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్‌.. బైక్‌లపై వచ్చి ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్‌లోని ప్రాంతంలో యువతి కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దేవరకొండ బస్తీ రోడ్ నంబర్ 3లో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో యువతి తనను రక్షించాలంటూ గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే కిడ్నాపర్లు ఆమెను తీసుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇది తెలిసిన వారిప పనేనా? లేక ఏదైనా ముఠా హస్తం ఉందా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu