బిగ్ బాస్ షో.. ఏముందిరా అందులో.. ఫుల్‌గా పెడతారు.. తినేది అరిగేదాకా కొట్టుకోమని టాస్క్‌లు ఇస్తారు.. తిట్టుకున్నోళ్లకి తిట్టుకున్నంత.. కొట్టుకున్నోళ్లకి కొట్టుకున్నంత.. మధ్య మధ్యలో ఆరబోతలు.. హగ్‌లు.. దారబోతలు ఇవన్నీ ఎక్స్ ట్రా వర్క్స్.. ఇంతకు మంచి ఏముంటుందెహే ఈ బిగ్ బాస్‌లో అనే విమర్శలు ఉండనే ఉన్నాయి. అందుకే జస్ట్ ఫర్ ఛేంజ్ అని అనుకున్నారో ఏమో కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఫుడ్ కట్ చేశారు బిగ్ బాస్.. ఆకలి బాధ ఏంటో తెలిసేలా ఒక టాస్క్ ఇచ్చి ఆటాడిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తూ నేటి (సెప్టెంబర్ 29) ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. ఇంటి సభ్యులంతా ఇద్దరిద్దరు చొప్పున జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్న విషయం తెలిసిందే. జంటలు ఎవరెవరంటే.. 1. కాజల్-జెస్సీ 2. షణ్ముఖ్- సిరి 3. లోబో- నటరాజ్ 4. రామ్ -హమీదా 5. శ్వేతా-ఆనీ మాస్టర్ 6. ప్రియ- ప్రియాంక 7. రవి - విశ్వ 8. సన్నీ - మానస్ ఇలా హౌస్ మొత్తం ఎనిమిది జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్నారు. నేటి ఎపిసోడ్లో మొదటిగా జంటగా ఉన్న మానస్, సన్నీలు గేమ్ ఎలా ఆడాలన్నదానిపై చర్చించారు.. సన్నీ ఆకలి వేస్తుందని అంటే.. ఈరోజుకి కష్టపడదాం అని చెప్పాడు మానస్. ఆ తరువాత ఇద్దరూ వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఇక నటరాజ్ మాస్టర్.. లోబోకి హితబోధ చేశాడు. నీకు మంచి ఫుడ్ పెడతా టాస్క్ అయిపోగానే.. ఈరోజుకి తట్టుకో అని చెప్పాడు. ఆ తరువాత బిగ్ బాస్ అన్నం విలువ ఏంటో ప్రాక్టికల్‌గా చూపించారని అంటే.. ఇకపై ఎక్కడైనా ఎవరైనా అన్నం పడేస్తూ కనిపిస్తే గుద్దుతా అని చెప్పాడు లోబో. ఆ తరువాత ఆకలి బాధని తెలియజేస్తూ సందేశాత్మకంగా మెసేజ్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి, లోబో, విశ్వ, ప్రియలు ఎమోషనల్‌గా టాస్క్ చేసి ఏడిపించేశారు. ఆకలి రాజ్యం స్పూప్‌తో ఇరగదీశారు. జెస్సీ, కాజల్‌లు టాస్క్ నుంచి ఔట్.. బిగ్ బాస్ పనిష్మెంట్.. ఇంట్లో ఆహారాన్ని ఎవరూ ముట్టకూడదని బిగ్ బాస్ ఆదేశించినప్పటికీ లోబో, సన్నీ ఆహారాన్ని తినడంతో కెప్టెన్‌గా ఉన్న జెస్సీ విఫలం అయ్యాడని.. అందుకే అతనితో పాటు అతనికి జోడీగా ఉన్న కాజల్ కూడా కెప్టెన్ పోటీదారులుగా ఉండే అవకాశాన్ని కోల్పోయారని.. వాళ్లిద్దరూ కేవలం సంచాలకులుగా మాత్రమే ఉంటారని చెప్పారు బిగ్ బాస్. దీంతో తాను చెప్తున్నప్పటికీ రూల్స్ బ్రేక్ చేశారని ఫైర్ అయ్యాడు జెస్సీ. తన వల్ల కెప్టెన్ పోటీదారునిగా అర్హత కోల్పోయిన కాజల్‌కి క్షమాపణ చెప్పాడు. ఆ తరువాత రవి-విశ్వలకు పవర్ రూం యాక్సెస్ లభించడంతో వాళ్లకి పోటీగా ప్రియ-ప్రియాంకల జోడీని ఎంచుకున్నారు. కొన్ని కట్టెలు ఇచ్చి వాటిని ముక్కలుగా చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో.. కండలు తిరిగిన విశ్వ.. టపా టపా కట్టెల్ని ముక్కలుగా చేయడంతో ఆడాళ్లపై విజయం సాధించారు. అయితే వాళ్లు ఫిజికల్ టాస్క్‌లో గెలిచినప్పటికీ పింకీ-ప్రియాంకలు గట్టి పోటీ ఇచ్చారు. పింకీ అయితే ఆడ పులిలా ఆట ఆడింది. దీంతో అందరూ శభాష్ అన్నారు. లోబోకి ఆకలి.. చెత్త కవర్లో ఉన్న ఆహారం కోసం నటరాజ్ మాస్టర్ టీంలో ఉన్న లోబో ఆకలికి తట్టుకోలేక.. చెత్త కవర్లో దాచి పెట్టిన ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు. ఎవరూ చూడకుండా ఆ చెత్త కవర్లో ఉన్న ఆహారాన్ని తీసుకుని తినడానికి ట్రై చేశాడు.. అయితే ఆ విషయాన్ని రవి పసిగట్టి.. రేయ్ పిచ్చినా కొడకా ఏం చేస్తున్నావ్ రా అని వారించాడు. అయితే సీన్ చూసిన నటరాజ్ మాస్టర్.. ఇలా చేయొద్దు నేను గేమ్ వదిలేస్తున్నా నువ్ తినెయ్ అని చెప్పాడు. మరోవైపు సన్నీ-మానస్‌లకు పవర్ రూం యాక్సెస్ లభించడంతో.. నటరాజ్ మాస్టర్-లోబోలను పోటీదారులుగా ఎంచుకున్నారు. అయితే ఎప్పుడైతే సన్నీకి యాక్సెస్ లభించిందో షణ్ముఖ్, సిరిలు మూలగడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా మన పేరే చెప్తాడు అని షణ్ముఖ్ సిరితో చెప్పగా.. సన్నీ మాత్రం నటరాజ్ మాస్టర్, లోబోలను సెలెక్ట్ చేసుకున్నారు. లోబో ఫుడ్ లేకుండా ఉండలేడు.. కానీ ఈ టాస్క్‌లో చాలా కంట్రోల్‌గా ఉన్నాడు.. ఇది వాళ్లకి అడ్వాంటేజ్ ఉంటుందని వాళ్లని ఎంచుకున్నట్టు చెప్పారు సన్నీ. మొత్తంగా ఈ మనుగుతారా తేలుతారా టాస్క్‌లో సన్నీ-మానస్‌లో విన్నర్స్‌గా నిలిచారు. అయితే ఇంటి సభ్యుల ఆకలి సహనాన్ని పరీక్షించడానికి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వాళ్లందరికీ మటన్ బిర్యానీ పంపారు. అయితే సిరి-షణ్ముఖ్, మానస్-సన్నీ, శ్రీరామ్-హమీదా ఈ మూడు జంటలు తప్ప మిగిలిన వాళ్లంతా బిర్యానీ లాగించేశారు. అయితే తన టీంలో ఉన్న లోబో బిర్యానీ లాగించేసినా.. నటరాజ్ మాస్టర్ తినకుండా ఒంటరి పోరాటం చేస్తూ కనిపించాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో.. కెప్టెన్ పోటీదారులు ఎవరో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.
0 Comments