Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

పెరిగిన బంగారం ధర.. వెండి జిగేల్!

పసిడి ప్రేమికులకు ఝలక్. బంగారం ధర మరోసారి పెరిగింది. పసిడి రేటు పెరగడం ఇది వరుసగా రెండో రోజు. బంగారం ధర పైకి కదిలితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి జిగేల్‌మంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.48,610కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.160 పెరుగుదలతో రూ.44,560కు ఎగసింది. Also Read: బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు రూ.800 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,700కు చేరింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.07 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1820 డాలర్లకు ఎగసింది. వెండి రేటు కూడా పెరిగింది. ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 24.17 డాలర్లకు చేరింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

Post a Comment

0 Comments

Close Menu