Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

నేటి బంగారం, వెండి ధరలు ఇలా!

నిన్న పైకి కదిలిన బంగారం ధర ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగింది. పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగుతోంది. బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో బంగారం ధర రూ.48,110 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.44,110 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. Also Read: బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు మాత్రం పెరిగింది. వెండి రేటు రూ.100 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.73,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి రేటు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో ధర పెరగడం గమనార్హం. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 0.29 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1775 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.26 శాతం తగ్గుదలతో 26.15 డాలర్లకు క్షీణించింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

Post a Comment

0 Comments

Close Menu