Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

యువకుడి ప్రేమ వేధింపులు... ఇంట్లో చెప్పని బాలిక, చివరికి

యువకుడి ప్రేమ వేధింపులకు బాలిక బలైపోయింది. జిల్లా తాడేపల్లికి చెందిన బాలిక(16) పదో తరగతి చదువుతోంది. కొద్దిరోజుల క్రితం ఆమె ఇంటికి సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లిన సమయంలో మహేంద్ర అనే యువకుడు వేధించాడు. అప్పటినుంచి ఆమె ఎక్కడికెళ్లినా వెంటపడుతూ ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడిన బాలిక ఈ నెల 4వ తేదీన గడ్డి మందు తాగేసింది. తక్కువ మోతాదులో తీసుకోవడంతో నాలుగు రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. అయితే పదో తేదీన వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై విజయవాడలోని పటమట పోలీస్‌స్టేషన్‌ నుంచి సమాచారం రావడంతో 14వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు మహేంద్రపై కేసు నమోదు చేసి ఈ నెల 17న అరెస్టు చేశారు. మరోవైపు బాలిక చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించారు. తమ బిడ్డ ప్రాణాలు బలి తీసుకున్న మహేంద్రను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu