Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

ప్రైవేట్ ఆస్పత్రులపై.. ప్రధాని మోదీకి సీఎం జగన్ సంచలన లేఖ!

కోవిడ్ వ్యాక్సిన్‌లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చిన వ్యాక్సిన్లను కూడా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించారని.. ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీకి సీఎం రాసిన లేఖలో ఏముందంటే..‘‘జూలై నెలలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్‌ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలి’’ అని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu