Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

Krishnapatnam: కరోనాతో కోటయ్య మృతి.. ఆనందయ్య మందుపై సందేహాలు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారుచేసిన మందు తీసుకుని కోలుకున్నట్లు చెప్పిన విశ్రాంత కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న కోటయ్య 10 రోజులుగా నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన సోమవారం ప్రాణాలు కోల్పోయారు. ఆనందయ్య కరోనా మందుకు క్రేజీ తీసుకొచ్చింది రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యే. ఆనందయ్య తనకు బాగా పనిచేసిందని, ఆయన మందును కళ్లల్లో వేసుకోగానే తనకు ఆక్సిజన్ లెవల్స్ బాగా పెరిగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని కోటయ్య తెలిపారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ కావడంతో ఆనందయ్య మందుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో ప్రజలు కృష్ణపట్నానికి బారులు తీరారు. తదనంతర పరిస్థితులతో పంపిణీకి బ్రేక్ పడింది. తిరిగి ఆనందయ్య మందు పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారా? అని ప్రజలంతా ఎదురుచూస్తున్న సమయంలో కోటయ్య మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో ఆనందయ్య మందుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణుల అధ్యయనం పూర్తి చేసింది. ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నంలో పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. ఆనందయ్య వినియోగిస్తున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు అభిప్రాయపడ్డారు. రెండు మూడు రోజుల్లో ఆనందయ్య మందుపై నివేదిక రానున్న నేపథ్యంలో కోటయ్య మరణం హాట్‌టాపిక్‌గా మారింది.

Post a Comment

0 Comments

Close Menu