Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

ఆర్మీకి సెలక్ట్ అయిన యువకుడు.. నిండా ముంచిన ప్రేమ, చివరికి విగతజీవిగా

తాను ప్రేమించిన అమ్మాయికి మరో అబ్బాయితో పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా మండలంలో శనివారం చోటు చేసుకుంది. పొందూరు మండలం జాడపేట(మలకాం) గ్రామానికి చెందిన మల్లిపెద్ది నవీన్‌ (22) ఇంటర్‌ పూర్తిచేసి ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాజాం మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమించి ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ యువతికి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న నవీన్ శనివారం ఆమె గ్రామానికి వెళ్లి ఆరా తీశాడు. ప్రియురాలు తనకు దక్కదన్న మనోవేదనతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు. అదే గ్రామంలో నివాసముండే నవీన్‌ మేనత్త రమణమ్మకు ఈ విషయం తెలియటంతో వెంటనే నవీన్‌ తండ్రి శంకరరావుకు సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రాజాం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అది కొవిడ్‌ ఆసుపత్రి కావటంతో రాజాంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. చేతికి అందొచ్చిన కొడుకు కళ్లెదుటే మృతి చెందటంతో తండ్రి శంకరరావు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu