Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

చేప మందుపై బత్తిన సోదరుల కీలక నిర్ణయం

చేపమందుకు ఈ ఏడాది కూడా బ్రేక్ పడింది. కరోనా నేపథ్యంలో చేప మందును నిలిపి వేశారు. జూన్ 8వ తేదీన పంపిణీ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో చేప మందు పంపిణీ చేయడం లేదనీ బత్తినీ హరినాథ్ గౌడ్ ప్రకటించారు. ఈ సారి చేప మందు ను తామే ఇంట్లో అందరం తీసుకుంటామని బత్తిని ప్రకటించాడు. చేప మందు కోసం ఎవరు కూడా హైదరాబాద్ రావద్దని ప్రకటించారు. ప్రతీ ఏడాది మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేప మందు పంపిణీని ఈ ఏడాది అందజేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ వెల్లడించారు.ఈ చేప మందు వేసుకోడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబీకులు 173 సంవత్సరాలుగా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu