Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

17 ఏళ్లకే యువతితో బాలుడి సహజీవనం.. చివరకు విషాదం

ఆమె మేజర్.. అతడు మైనర్. ఆమె వయసు 20 ఏళ్లు. బాలుడి వయసు 17ఏళ్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంతలోనే ప్రేమ అంటూ ఓ యువతి వెంట పడ్డాడు. పెళ్లి పేరుతో ఆమెతో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పెద్దలు వారించినా వినకుండా ఇద్దరు నెల రోజులుగా సహజీవనం చేస్తున్నారు. ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్థలతో తలెత్తాయి. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. బాలుడి చనిపోగా .. యువతి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన దాని ప్రకారం యూసుఫ్‌గూడలో నివసించే యువకుడు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తూ సినీ పరిశ్రమలో పనిచేస్తున్న యువతి(20)తో ప్రేమలో పడ్డాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో జవహర్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకొని ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారు. వారం క్రితం గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో యువకుడు, యువతి మధ్య రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మనస్పర్థలు పెరిగి.. శనివారం తెల్లవారుజామున ఇద్దరూ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించారు. యువతి చున్నీ ఊడిపోవడంతో కింద పడిపోయింది. అప్పటికే యువకుడి మెడకు ఉరి బిగుసుకుంది. ఆమె వెంటనే వెళ్లి చుట్టుపక్కల వారిని తీసుకొచ్చేసరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తండ్రి పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu