Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

Jonnagiri: లచ్చిందేవీ తలుపుతట్టింది... లక్షాధికారి అయిన మహిళా కూలీ

టమాటా తోటలో కూలి పనికి వెళ్లిన మహిళకు అదృష్టం వరింది. కర్నూలు జిల్లా మండలంలోని గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం పొలంలో కూలి పనులకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగా ఓ రంగు రాయి దొరికింది. దాన్ని స్థానికంగా ఓ వ్యాపారికి చూపించగా వజ్రమని నిర్ధారణ తేల్చాడు. నాలుగున్నర క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6.50 లక్షలు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తుగ్గలి ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. కొద్దిరోజుల క్రితం ఓ రైతన్నకు తన పొలంలోనే ఓ వజ్రం దొరకగా.. దాన్ని కోటి రూపాయలకు పైగా విక్రయించాడు. అదే వారంలో మరో ఇద్దరిక వజ్రాలు దొరికాయి. దీంతో స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాన్వేషణ కొనసాగిస్తుండటంతో జొన్నగిరి పొలాలు కిటకిటలాడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu