Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

జగన్ సర్కార్‌కు కేంద్రం శుభవార్త.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, మరో ఆరు నెలలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌ శర్మ పదవీకాలం పొడిగించారు. ఆయన మరో 6 నెలలు పాటు ఏపీ సీఎస్‌గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సీఎస్‌గా పనిచేయనున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు నెలల క్రితం ఆదిత్యనాథ్ దాస్ స్థానంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. సమీర్‌ శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2న కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. అయితే తాజా పొడిగింపుతో సమీర్‌ శర్మ మరో ఆరునెలలు ఏపీకి చీఫ్‌ సెక్రెటరీగా సేవలు దించనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu