Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. వెండి వెలవెల.. లేటెస్ట్ రేట్లు ఇలా!

పసిడి ప్రేమికులకు ఊరట. బంగారం ధర తగ్గింది. పసిడి ధర వెలవెలబోయింది. నేలచూపులు చూసింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కూడా క్షీణించింది. బంగారం వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 క్షీణించింది. దీంతో బంగారం Gold ధర రూ.48,930కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 క్షీణతతో రూ.44,850కు తగ్గింది. Also Read: బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర రూ.300 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి Silver ధర రూ.68,800కు క్షీణించింది. వెండి పట్టీలు, కడియాలు కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.98 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1784 డాలర్లకు దిగొచ్చింది. వెండి రేటు కూడా ఇదే దారిలో కదిలింది. ఔన్స్‌కు 0.63 శాతం క్షీణతతో 23.96 డాలర్లకు తగ్గింది. Also Read: కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను GST (జీఎస్‌టీ), ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి.

Post a Comment

0 Comments

Close Menu